2025 బిగ్గెస్ట్ డిజాస్టర్లలో గేమ్ ఛేంజర్ మూవీ ఒకటిగా నిలిచింది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు రాగా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. పరుచూరి గోపాలకృష్ణ గేమ్ ఛేంజర్ సినిమా గురించి తనదైన శైలిలో రివ్యూ ఇవ్వగా ఆ రివ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ శంకర్ కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు నమోదయ్యాయని పరుచూరి తెలిపారు.
 
అయితే ఈ సినిమాకు లాభాలు రాలేదని అనిపిస్తోందని ఆయన తెలిపారు. గేమ్ ఛేంజర్ మూవీ ఐపీఎస్ కావాలనుకుని ఐఏఎస్ అయిన యువకుడి కథ అని పరుచూరి చెప్పుకొచ్చారు. చాలామంది డైరెక్టర్లు మోడ్రన్ స్క్రీన్ ప్లేకు అలవాటు పడ్డారని అయితే బాల్కనీలో మాత్రమే కాదు సెకండ్ క్లాస్ లో కూడా ప్రేక్షకులు ఉంటారని చాలామంది గమనించట్లేదని నా ఒపీనియన్ అని పరుచూరి పేర్కొన్నారు.
 
నా డ్రైవర్సినిమా కథ కలెక్టర్ కథ అని నాకు అర్థం కాలేదని చెప్పారని పరుచూరి వెల్లడించడం గమనార్హం. ఈ మధ్య కాలంలో మెజారిటీ సినిమాలు హీరో మెయిన్ విలన్ పై నడుస్తున్నాయని పరుచూరి కామెంట్లు చేశారు. హీరోల రోల్స్ విషయంలో తప్పు లేకపోయినా వాటిని ప్రజెంట్ చేయడంలో లోపం తలెత్తుతోందని అనిపిస్తోందని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
శ్రీకాంత్ పోషించిన పాత్ర చుట్టూ ఆసక్తికర సన్నివేశాలను తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. ప్రియురాలి కోసం ఫైట్లు మానేసేలా చరణ్ రోల్ ను తీర్చిదిద్దడం రైట్ కాదని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో హీరో పాత్రకు రామ్ నందన్ అని పేరు పెట్టడం వెనుక కూడా ముఖ్యమైన కారణం ఉందని రాముడు శాంత స్వరూపుడు అని పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్ల విషయంలో తీవ్రస్థాయిలో నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో ఈ స్థాయిలో నిరాశ పరిచిన సినిమా లేదనే సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: