నాగ్ అశ్వీన్.. చాలా సింపుల్ గా ఉంటాడు . చాలా సైలెంట్ గా ఉంటాడు.  తన పని తను చూసుకుని పోతాడు . ఎవ్వరిని ఒక్క మాట నెగిటివ్ గా మాట్లాడు . తనపై నెహిటివ్ మాటలు మాట్లాడినా సరే చాలా సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు.  పీస్ఫుల్ కోరుకునే డైరెక్టర్స్ లో నాగ్ అశ్వీన్ ముందు వరుసలో ఉంటారు . తన పని తాను చూసుకోవడం తప్పిస్తే పక్క వాళ్ళ పనిలో ఎటువంటి విధంగా వేలుపెట్టడు.  కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని ..పాన్ ఇండియా  లెవల్ లో తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్న కల్కి మూవీ డైరెక్టర్ నాగ్  అశ్విన్ .. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడో మనకు తెలిసిందే.


ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. నాగ్ అశ్వీన్ "కల్కి" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే . అయితే దీనికి తిరిగి రెండో భాగం కూడా ఉంది. రెండో భాగం కూడా తెరకెక్కాలి. అయితే ఇప్పుడు అప్పట్లో ఈ పనులు కంప్లీట్ అయ్యేలా కనిపించట్లేదు.  ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్లిపోతున్నాడు . ఈలోపు ప్రభాస్ కోసం వేచి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వేరే సినిమాను తెరకెక్కించడమే బెటర్ అంటూ ఫిక్స్ అయ్యాడట నాగ్ అశ్వీన్.



అయితే ఈసారి ఫుల్ టు ఫుల్ ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టుతో రాబోతున్నారట . అది కూడా అలియా భట్ ను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . ఇది ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఆయన రాసుకున్న స్టోరీ అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ - రాజమౌళి హీరోయిన్ అలియా భట్ ని పట్టేసాడు అని..  ఇక రాజమౌళి పేరుని కూడా మర్చిపోయే స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తాడు అని .. ఓరేంజ్ లో ఫ్యాన్స్ ఆయన పేరుని బాగా ట్రెండ్ చేస్తున్నారు.  ఇప్పుడు సోషల్ మీడియాలో నాగ్ అశ్వీన్ - అలియా కాంబోలో రాబోతున్న మూవీ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . నిజంగానే చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సంపాదించేసుకున్నాడు నాగ్ అశ్వీన్ అంటూ ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: