![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-rashmika-mandannaa4ccb978-e667-4977-bf81-3f2969de1ff8-415x250.jpg)
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఫిబ్రవరి 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా రష్మిక మందన్నా పర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఆమె మాట్లాడుతూ.." ట్యాగ్స్ అనేటివి కెరీర్ కి ఉపయోగపడతాయి అంటే నేను అసలు నమ్మనే నమ్మను. కొంతమంది అభిమానులు అవి తమ పట్ల ప్రేమగా ఇస్తూ ఉంటారు . అంతే తప్పిస్తే ఆ ట్యాగ్స్ వల్ల సినిమా హిట్ అవుతుందని .. మన కెరియర్ ముందుకు వెళుతుందని నేను అనుకోను ..కేవలం ట్యాగ్స్ .. ట్యాగ్స్ గానే పనికి వస్తాయి.. మనం నటించే చిత్రాలు ప్రేక్షకుల ప్రేమాభిమానాలే టికెట్స్ ని ప్రభావం చూపిస్తాయి .. అనుకోకుండా ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఇప్పటివరకు 24 చిత్రాలు నటించాను ..ప్రతి ఒక్క సినిమా నాకు స్పెషల్ ఫీలింగ్ ని కలగజేసింది "అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్నా మాటలు బాగా వైరల్ అవుతున్నాయి . అయితే చాలామంది స్టార్ హీరోస్ కి ట్యాగ్స్ ఉన్నాయి. ఆ హీరోస్ పై పరో క్షకంగా కౌంటర్ వేసింది రష్మిక అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు, కొంతమంది జనాలు అయితే రష్మిక చాలా సింపుల్ వే లోని ఇది మాట్లాడింది అని .. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ రష్మిక ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు . రష్మిక మందన్నా ట్యాగ్స్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హీట్ పెంచేస్తున్నాయి..!