సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి కెరియర్ బిగినింగ్ లో క్రేజీ సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా ఆ సినిమాలు విజయాలు సాధించకపోవడం వల్ల కావచ్చు , మరికొన్ని కారణాల వల్ల కావచ్చు తమ కెరీర్ను చాలా తొందర గానే ముగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే కెరియర్ను ప్రారంభించిన కొత్తలో అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ అదిరిపోయే రేంజ్ లో కెరీర్ ను ముందుకు సాగించిన ఓ బ్యూటీ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకుండా కెరియర్ను కొనసాగిస్తుంది ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు పూనమ్ బాజ్వ.

ఈ ముద్దుగుమ్మ నవదీప్ హీరోగా రూపొందిన మొదటి సినిమా అనే మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినా ఈ మూవీ ద్వారా పూనమ్ బజ్వా కు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికి ఈమెకు నాగార్జున హీరోగా నయనతార హీరోయిన్గా రూపొందిన బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చింది. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినా కూడా ఈ మూవీ లో ఈమె తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం ద్వారా ఈ మూవీ ద్వారా ఈ ఒక మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పరుగు సినిమాలో హీరోయిన్ కు అక్క పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత ఈమెకు పెద్దగా తెలుగు సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: