టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగా హీరోలు కూడా ఉంటారు. ఇకపోతే మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరోలలో ఒక హీరోయిన్ ఏకంగా నలుగురు మెగా హీరోలకు అద్భుతమైన విజయాలను అందించింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న మెగా హీరోలలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఉన్నారు. ఈ నలుగురితో కూడా నటించి నలుగురు హీరోలకు మంచి విజయాలను అందించిన హీరోయిన్లలో శృతి హాసన్ ఉంటుంది. శృతి హాసన్ , మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి.

మొదటగా వీరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ మూవీ రాగా ఆ తర్వాత కాటమ రాయుడు , వకీల్ సాబ్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో గబ్బర్ సింగ్ , వకిల్ సాబ్ మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన ఎవడు సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రూపొందిన రేసు గుర్రం సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా మెగా హీరోలు అయినటువంటి చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ నలుగురితో కూడా శృతి హాసన్ నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: