టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి టాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులతో శృతి హాసన్ ఒకరు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. మొదటగా వీరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే మూవీ రాగా , ఆ తర్వాత కాటమ రాయుడు , వకీల్ సాబ్ సినిమాలు వచ్చాయి.

ఈ మూడు సినిమాలలో కాటమ రాయుడు మూవీ ని మినహాయిస్తే గబ్బర్ సింగ్ , వకీల్ సాబ్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరి వీరి కాంబినేషన్లో రూపొందిన ఈ మూడు సినిమాలలో ఓ చిన్న కామెంట్ పాయింట్ ఉంది అదేంటో తెలుసా ..? ఇకపోతే పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మూడు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి అంటే ఈ మూడు సినిమాలు కూడా రీమేక్ మూవీలే. పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ హిందీ సినిమా అయినటువంటి దబాంగ్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది.

ఇక పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో రెండవ మూవీ గా రూపొందిన కాటమ రాయుడు సినిమా తమిళ మూవీ అయినటువంటి వీరం కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. ఇక పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో మూడవ మూవీ గా రూపొందిన వకీల్ సాబ్ మూవీ హిందీ సినిమా అయినటువంటి పింక్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ మూడు సినిమాలు కూడా వేరే మూవీ లకు అధికారిక రీమేక్ లుగా రూపొందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: