లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రదీన్ రంగనాథన్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ నన్ను చాలామంది కిందికి లాగాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించడం గమనార్హం.
 
కానీ నేను పెరుగుతున్న మొక్కనని మొక్క మాను కావడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. నేను కూడా ఆ ఛాలెంజ్ లను స్వీకరిస్తూ మరింత బలంగ ఎదుగుతానని ప్రదీప్ రంగనాథన్ తెలిపారు. నేను హీరోగ నటించిన లవ్ టుడే సినిమాకు హీరోయిన్ దొరకడం కష్టమైందని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. నేను హీరో అనగానే నాతో నటించడానికి చాలామంది హీరోయిన్లు తటపటాయించారని ఆయన వెల్లడించారు.
 
కొందరు హీరోయిన్లు మాత్రం డేట్స్ కుదరలేదని చెప్పి తప్పించుకున్నారని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. మరి కొందరు మాత్రం నిజాయితీగా నా పక్కన చేయనని పెద్ద హీరోలతో మాత్రమే చేస్తానని చెప్పారని ఆయన వెల్లడించారు. ఆ హీరోయిన్ల నిజాయితీకి థ్యాంక్స్ అని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. డ్రాగన్ సినిమాతో అనుపమతో కలిసి నటించానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.
 
డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అశ్వత్ మురిముత్తు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. డ్రాగన్ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
 
ప్రదీప్ రంగనాథన్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ యువతను ఎంతగానో మెప్పిస్తున్నారు. లవ్ టుడే సక్సెస్ తో ప్రదీప్ రంగనాథన్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నరు.


మరింత సమాచారం తెలుసుకోండి: