కొన్ని సంవత్సరాల క్రితం భరత్ హీరో గా సంధ్య హీరోయి న్గా ప్రేమిస్తే అనే సినిమా రూపొందిన విషయం మన అందరి కీ తెలిసిందే . ఇకపోతే తమి ళ్ లో కాదల్ అనే పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలు గు లో ప్రేమిస్తే అనే పేరుతో విడుదల చేశారు. పెద్దగా అంచనాలు లేకుం డా విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆ ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది . ఈ సినిమాలో భరత్ , సంధ్య మధ్య కెమిస్ట్రీ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో సంధ్య కు ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఆసిన్ హీరోయిన్గా రూపొందిన అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ కు చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగు లో మరింతగా పెరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం ఈ నటి భారీగా తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం ఈమె దాదాపుగా సినిమా ఇండస్ట్రీకి దూరం గానే ఉంటూ వస్తుంది.

ఇకపోతే 2004 వ సంవత్సరం విడుదల అయిన ప్రేమిస్తే సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికి కూడా అదే స్థాయి అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది. సంధ్య సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: