నందమూరి బాలకృష్ణ చాలాకాలం తర్వాత మళ్లీ సీక్వెల్ లో నటిస్తూ ఉన్నారు.. అదే అఖండ 2. డైరెక్టర్ బోయపాటి కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండగా ఇందుకు సంబంధించి షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇందులో సంయుక్త మీనన్ నటిస్తూ ఉన్నది. కరోనా సమయంలో తక్కువ టికెట్ల రేటుకి విడుదలైన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అప్పట్లో రూ 70 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ సాధించి భారీ విజయాన్ని అందుకున్న అఖండ సినిమా ఈసారి అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించి బాలయ్య కెరియర్ లోని అత్యధిక కలెక్షన్స్ రాబట్టే చిత్రంగా నిలబెట్టాలని చూస్తున్నారట.


ఇటీవలే బాలయ్య డాకు మహారాజ్ చిత్రంతో కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో యాక్షన్స్ అన్ని వేషాలు అభిమానులను మెప్పించడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో పరవాలేదు అనిపించుకుంది. కానీ రూ.100 కోట్ల మార్కునైతే అందుకోలేకపోయిందట. వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ అఖండ 2 చిత్రానికి రూ .150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారట.. అఖండ 2 సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా మంచి పోటీ ఉన్నదట. వీటి వల్ల కొన్ని కోట్ల రూపాయలు రాబోతున్నాయట.


అఖండ 2 సినిమా బడ్జెట్ కి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉండడంతో ఈ సినిమా బాలయ్య కెరియర్ లోనే సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25 విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అఖండలో అఘోర పాత్రలో అద్భుతంగా అలరించిన బాలయ్య.. మరి అఖండ 2 లో ఏ విధంగా మెప్పిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఏ మేరకు బాలయ్య కెరియర్ల ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: