టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల కాంబో ఒకరి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మొదటగా జనతా గ్యారేజ్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో సమంత , నిత్యా మీనన్ హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా వీరి కాంబినేషన్లో దేవర పార్ట్ 1 అనే సినిమా వచ్చింది. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే దేవర పార్ట్ 1 మూవీ మంచి విజయం సాధించడంతో మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి కొనసాగింపుగా దేవర పార్ట్ 2 ను కూడా కొరటాల శివ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ఈ రెండు సినిమాల గురించి మాత్రమే చాలా మంది కి తెలుసు. కానీ జనతా గ్యారేజ్ కంటే ముందే తారక్ హీరోగా రూపొందిన ఓ సినిమా కోసం కొరటాల శివ పని చేశాడు. ఆ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ మూవీ ఏదో తెలుసా ..? అది బృందావనం.

కొన్ని సంవత్సరాల క్రితం తారక్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథ రచయితల్లో కొరటాల శివ కూడా ఒకరు. కొరటాల శివ అలా తారక్ పని చేసిన బృందావనం సినిమాకు పని చేశాడు. ఆ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. బృందావనం సినిమాలో కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: