టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో సినిమా సినిమాకు వేరియేషన్స్ మార్చే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో ఎన్నో కొత్త కొత్త లుక్ లలో కనిపించి తన అభిమానులను , ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు కొత్త లుక్ లో కనబడాలి అనే ఉద్దేశంతో అనేక లుక్ లను ప్రయత్నించిన సందర్భంలో తారక్ కి ఓ సినిమా విషయంలో ఓ చేదు అనుభవం ఎదురైందట. కానీ సినిమా విడుదల తర్వాత మాత్రం ఆ లుక్ పై ప్రశంసల వర్షం కురిసిందంట.

ఆ వివరాలను ఆ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం తారక్ హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం అనే మూవీ ని సెట్ చేశాను. ఇక ఆ మూవీ కోసం తారక్ ను చాలా క్లాస్ లుక్ లో చూపించాలి అని వంశీ పైడిపల్లి డిసైడ్ అయ్యాడు. ఆ ముందు వరుసగా తారక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో నటిస్తూ వచ్చాడు. బృందావనం సినిమా క్లాస్ టచ్ ఉన్న మూవీ. దానితో ఆయనను క్లాస్ లుక్ లో చూపించాలి అని మేము కూడా అనుకున్నాం. అందులో భాగంగా తారక్ మీసాన్ని తీసేసి గడ్డాన్ని కూడా చిన్నగా ఉంచాం.

అలా ఓ ఫర్ఫెక్ట్ లుక్ వచ్చింది అనుకున్న తర్వాత కొన్ని పోస్టర్లను విడుదల చేశాము. కానీ జనాల నుండి ఆ పోస్టర్లకు నెగిటివ్ టాక్ వచ్చింది. తారక్ ని ఆ లుక్ లో చూడలేం. సినిమా పోతుంది అని కూడా కొంత మంది అన్నారు. కానీ మేము భయపడలేదు. ఇక సినిమా విడుదల అయిన తర్వాత తారక్ ని ఆ లుక్ లో చూసిన జనాలు తారక్ కి ఆ లుక్ అద్భుతంగా సెట్ అయ్యింది అని ప్రశంసలను కురిపించారు. ఇక సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: