టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో పూజా హెగ్డే , రష్మిక మందన కూడా ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఓ రెండు సినిమాల విషయంలో మాత్రం రష్మిక చేసిన పనికి పూజా హెగ్డే కు పెద్ద స్థాయిలో డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా ..? మొదటగా ఓ రెండు సినిమాల్లో రష్మికను హీరోయిన్గా సంప్రదించగా ఆమె ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఆ మూవీ మేకర్స్ ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా తీసుకోగా ఆ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయ్యాయట. దానితో పూజ హెగ్డే కి పెద్ద స్థాయిలో డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా ఆచార్య మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడి గా పూజా హెగ్డే నటించింది. మొదటగా ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా రష్మిక ను తీసుకోవాలి అనుకున్నారట. కానీ ఆమె ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో అందులో పూజా హెగ్డేను తీసుకున్నారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇక తమిళ నటుడు తలపతి విజయ్ హీరో గా రూపొందిన బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం మొదటగా రష్మిక కు వచ్చిందట. ఆమె ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో అందులో పూజా హెగ్డే హీరోయిన్గా తీసుకున్నారట. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: