![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rashmikab6a7afa7-bf3a-43cd-be78-4113444a40d7-415x250.jpg)
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. దినేష్ విజన్ ఈ మూవీకి నిర్మాతగా పనిచేస్తున్నారు. రష్మిక శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం తనకి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో ఏసుబాయి పాత్రకు రష్మిక 100 శాతం న్యాయం చేసిందని టాక్ వినిపిస్తుంది.
రష్మిక ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, పొగరు, సరిలేరు నికెవ్వరు, భీష్మ, యనిమాల్ సినిమాలు కూడా చేసింది. ఇటీవల ఈ అందాల భామ పుష్ప 2 లో శ్రీవల్లీ పాత్రలో నటించి హిట్ కొట్టేసింది. ఈమె నటనతో చాలా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసినప్పటికి.. అంతగా హిట్స్ పడలేదు. కానీ పుష్ప సినిమా తర్వాత ఈమె క్రేజ్ పెరిగిపోయింది. ఈమె ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో మొత్తం రష్మిక నే కనిపిస్తుంది.