టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు మూడే అయినప్పటికీ నాగ్ అశ్విన్ సృష్టించిన రికార్డ్స్ యావత్ ఇండియా సినిమా పరిశ్రమలోనే అలజడి రేపాయి. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ‘కల్కి సీక్వెల్’ కోసం జనాలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా? అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సదరు సినిమా నిర్మాత, నాగ్ అశ్విన్ మామ అయినటువంటి అశ్వినిదత్ జూన్ నెలలో సీక్వెల్ మొదలు పెడతామని హింట్ ఇవ్వడంతో జనాలు ఖుషీగా ఉన్నారు.

అయితే ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ చూస్తుంటే ఇప్పటిలో స్టార్ట్ అయ్యేలా కనబడడం లేదు. ఎందుకంటే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ పూర్తి అయ్యాక, ‘స్పిరిట్’ సెట్స్ మీదకు వెళుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా చెప్పడంతో నాగ్ అశ్విన్ సినిమా ఇంకాస్త లేట్ కావచ్చని టాక్ నడుస్తోంది. అయితే ఆలోపు అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలీవుడ్ స్టార్ క్వీన్ అలియా భట్ తో కథకు సంబంధించిన చర్చ జరిగినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో ఆమెనే మొదటి ఛాయస్‌గా పెట్టుకున్నాడట. ఈ నేపథ్యంలోనే మొదట అలియాకు స్టోరీ లైన్ చెప్పాడని.. ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక కల్కి సీక్వెల్ సినిమాకి ఎలాగూ సమయం పడుతుండటంతో నాగ్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వినికిడి. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. అలియాకు డేట్ల సమస్య ఉందని రూమర్. ప్రజంట్ ఈ అమ్మడు ‘అల్ఫా’, ‘లవ్ అండ్ వార్’, ‘చాముండా’ వంటి సినిమాలు బిజీగా చేయడంతో ఈ సినిమా ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయడం ఒకింత కష్టంగా మారిందట. కనుక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చెంత వరకు వేచి చూడాలి. మరికొన్ని రోజుల్లో ఈ విషయమై ఓ క్లారిటీ వస్తుంది మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: