![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vishwak-sen-laila-movie-first-day-collection7893e5ce-4f51-4dbe-83b2-4a6b79bae318-415x250.jpg)
ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి వచ్చి ప్రమోట్ చేసినా కూడా కలిసి రాలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి షో నుంచే ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని మూటకట్టుకుంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టిందనే విషయం గురించి ఇప్పుడు ఒక న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు మొత్తం 8 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట..
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 10 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉండగా.. ఈ సినిమా మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని కేవలం కోటి రూపాయల లోపే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టేలా కనిపించడం లేదట.. సినిమా కథ రొటీన్ గా ఉన్న పెద్దగా ఎక్కడ కూడా ఆశించదగ్గ స్థాయిలో పాత్రలు లేవని కేవలం విశ్వక్ ఒక్కడే ఈ సినిమాని నెట్టుకు రావడం కష్టమే అన్నట్లుగా పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు. మరి చిత్రబృందం అఫీషియల్ గా ఏ మేరకు ఫస్ట్ డే కలెక్షన్స్ అని ప్రకటిస్తారో చూడాలి.