![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/star-hero098a778e-6c71-434e-95dd-b2245dd0640f-415x250.jpg)
1971లో అనుభవంగల్ పాలిచకల్ అనే సినిమాలో చిన్న పాత్రతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు .. ఆ తర్వాత 1980లో మేళా సినిమాతో హీరోగా మారారు .. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో అత్యంత వేగంగా బిజీగా ఉండే హీరోలు ఒక్కరిగా గూర్తింపు తెచ్చుకున్నడు .. అలాగే 1982లో ముమ్ముట్టి 24 సినిమాలను నటించారు .. ఆ తర్వాత 1983 నూంచి 1986 వరకు ఈ హీరో ప్రతి సంవత్సరం 36 , 34 , 28 , 35 సినిమాలో నటించి రికార్డులు క్రియేట్ చేశాడు . ఆయన కష్టపడే తత్వం ఆయన్ని ఇండియన్ చత్ర పరిశ్రమలోనే నెంబర్ వన్ నటులలో ఒకరిగా మార్చింది.
ఇలా హీరోగా మమ్ముట్టి తన సినీ జీవితంలో 400కుపైగా సినిమాలో నటించారు .. అలాగే 1983లో ఈ ఒక్క సంవత్సరంలోనే 36 సినిమాల్లో నటించారు .. ఈ స్టార్ హీరో కొడుకు దుల్కర్ సల్మాన్ తండ్రి సాధించిన ఈ రికార్డును చేరుకోవడానికి ఏకంగా 13 సంవత్సరాల పట్టింది .. 1983 లో ఆయన తీసిన ఆ రాత్రి సినిమా కోటి రూపాయల కలెక్షన్ వసూలు చేసిన తొలి మలయాళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది .. కూడేవిడే , అదియోజుక్కుకల్ వంటి ఇతర భారీ హిట్ సినిమాలతో కూడా భారీ స్టార్డం అందుకున్నారు .. అలాగే ముమ్ముట్టి తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును మతిలుకల్ చిత్రానికి అందుకున్నారు . అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాలో ఆయన పాత్రకు గాను జాతి అవార్డు కూడా వచ్చింది . ఇక మమ్ముట్టి తమిళం , తెలుగు , కన్నడ , వంటి భాషలో కూడా నటించారు .. ఇప్పటికి ఈ సీనియర్ హీరో వరుస సినిమాలో నటిస్తూ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు.