సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రేటిస్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వైరల్ అవుతూ ఉంటాయి . అది సర్వసాధారణమే . అలా ట్రెండ్ అయ్యే వాళ్లలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా కూడా సినిమాల పరంగానే వైరల్ అవుతూ ట్రెండ్ అవుతూ వచ్చేవారు.  కానీ ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.  ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ రీసెంట్గా పలు పుణ్యక్షేత్రాలన్ని దర్శించుకున్నారు .


ఆయనతో పాటు ఆయన కొడుకు అకీరానందన్ కూడా ఆయన వెంటే ఉంటూ దైవదర్శనాలను కంప్లీట్ చేసుకున్నారు.  అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన లుక్స్ కన్నా కూడా అకీరానందన్ కి సంబంధించిన లుక్స్ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చాలా సింపుల్ గానే ముందుకు వెళుతూ ఉంటాడు . అయితే ఇప్పుడు అఖీరానందన్ లుక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . అఖీరానందన్ నాన్నకు మించిన హైట్ తో నాన్నకు మించిన బాగా అట్రాక్టివ్ గా ఉన్నాడు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ .



అయితే కొంతమంది మాత్రం అఖీరానందన్ గడ్డం గురించి జుట్టు గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు . ఏంట్రా నిజంగానే అది ఒరిజినల్ జుట్టా..? విగ్గా..? నీకు అప్పుడే అంత పెద్ద గడ్డం వచ్చిందా..? అంటూ రకరకాలుగా ఆయన ఫొటోస్ ని ట్రోల్ చేస్తున్నారు . దీనిపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ అవుతున్నారు . అకిరానందన్ రియల్ హీరో అని .. అఖీరానందన్ పూర్తిగా నాచురల్ గా ఉంటాడు అని ..పక్క హీరోలు లా విగ్గులు ..గడ్డాలు బయట కంట్రీ నుంచి తెప్పించుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేనేలేదు అని .. పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీపరుడు నిజాయితీగా ఉంటాడో.. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొడుకు  కూడా నేచురల్ లుక్స్ తో కట్టిపడేస్తాడు అంటూ అకిరానందన్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ అకీర కి సంబంధించిన న్యూ లుక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: