![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/tabu-nagarjuna4953f236-e9f8-4c11-9402-0c69e6ccd81e-415x250.jpg)
గతంలో ఎంతో మంది హీరోలతో ఎఫైర్లు కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ అందులో టబు ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. ముఖ్యంగా టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున, టబు కొన్నేళ్లపాటు రిలేషన్ కొనసాగించినట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో వీరిద్దరూ కలిసి మొదటిసారిగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి అభిమానులు ఎంతగానో ఫిదా అయ్యారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో వారిని నటన, రొమాన్స్ కి అభిమానులు ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఈ జంట చాలా బాగుందని అనేక రకాల ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే నిన్నే పెళ్ళాడుతా సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగాయి. అంతేకాకుండా టబూ, నాగార్జున వివాహం కూడా చేసుకోవాలనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
అయినప్పటికీ వీరిద్దరూ వివాహం చేసుకోలేదు. ఈ విషయం పైన నాగార్జున ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని నాగార్జున వివరించారు. అంతేకాకుండా ఓ సమయంలో టబుని అమల ఇంటికి కూడా పిలిచినట్లుగా నాగార్జున స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది. ప్రస్తుతం టబు ఇప్పటికి సినిమాలలో నటిస్తుండడం విశేషం. హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలను పోషిస్తున్నారు.