మన చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి .. అలాగే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ సినిమాలు బోలుడు ఉన్నాయి .. ఇప్పుడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా పేరు తెచ్చుకున్న టాప్ 5 స్టార్ హీరోల సినిమాల గురించి ఇక్కడ చూద్దాం. ఎన్టీఆర్ మహానాయకుడు: నటరత్న ఎన్టీఆర్ జీవిత కథగా వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ టాలీవుడ్ లోనే మ‌హ‌ డిజాస్టర్ గా నిలిచింది .. ఎన్టీఆర్ కోడోకు నట‌సింహ బాలయ్య , క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు .. అయితే ఈ సినిమాలను బాలయ్య హీరోగా ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు అనే రెండు భాగాలుగా తీసుకొచ్చారు. అయితే ఈ రెండు భాగాల్లోనూ ఎలాంటి ట్విస్టులు వివాదాలు లేకుండానే సినిమాలు సింపుల్ గా తీసుకువచ్చారు .


కానీ ఎన్టీఆర్ నిజ జీవితంలో లెక్కలేని వివాదాలు ఉన్నాయి .. మొత్తానికి ఈ మూవీ రెండు భాగాలు కూడా ఆల్ టైం  డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాలని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా ప్రదర్శించినప్పటికీ ప్రేక్షకులు కనీసం ఈ సినిమాల‌ వైపు చూడలేదు .. అయితే నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకి 20 కోట్లు కలెక్షన్ అయినా వచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన మహానాయకుడు సినిమాకి మాత్రం కనీసం ఐదు కోట్ల కూడా రాలేదు .. దాదాపు 50 కోట్ల వరకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను కొన్న బయర్లు నష్టపోయారు.బ్రో: అలాగే తెలుగు సినిమా చరిత్రలోనే మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా కూడా ఒకటి .. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే అత్యంత చెత్త రికార్డును క్రియేట్ చేసింది .. 2023 లో భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది .. కానీ ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది .. సముద్రఖని దర్శకత్వంలో  కోలీవుడ్ లో వచ్చిన‘వినోదయ సీతం’ మూవీకి దీన్నే రీమేక్‌గా తీసుకొచ్చారు . ఆధ్యాత్మిక సబ్జెక్టుతో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల బిజినెస్ చేసింది .. మొత్తంగా ఈ  సినిమా 67 కోట్లు మాత్రమే రాబట్టింది .. దీంతో 30 కోట్లకు పైగా నిర్మాతలకు నష్టాలు వచ్చినట్టు టాక్.


గేమ్ ఛేంజర్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ .. త్రిబుల్ ఆర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్..  ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కె అమ్మ మొగుడని చెప్పాలి.. ఇక 2025లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చరిత్రలో కొత్త పేజీని రాసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజ్యం పాలై నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిల్చింది .. ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కేవలం 13 రోజులలో 168 కోట్లు మాత్రమే రాబట్టింది .. ఇక దీంతో నిర్మాతలకు 370 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది. ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో మెగా డిజాస్టర్ ఆచార్య కోర‌టల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే .. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ గా మిగిలింది. లైలా: మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా లైలాను షైన్ స్క్రీన్  స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. పలు వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది . తెలుగు సినిమా చరిత్రలోనే అతి చెత్త సినిమాగా ఈ మూవీ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: