సినిమా వాళ్లు అందులోనూ స్టార్ హీరోలు అంటే లవ్ ఎఫైర్లు , రూమర్లు ఎంతో కామన్ .. పలానా హీరోయిన్ తో పలానా హీరోకు ఎఫైర్ ఉందట ప్రేమించుకున్నారట .. పెళ్లి చూసుకో బోతున్నారట ఇలా ఎన్నో వార్త‌లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి .. వాటిలో కొన్ని నిజమౌతూ ఉంటాయి కూడా .. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రేమకు సంబంధించిన వార్త కూడా గ‌తంలో తెగ వైరల్ గా మారింది. అలాంటి సిని బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తన సొంత కాళ్ల మీద నిలబడి స్టార్ డం తెచ్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ లోనే మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు చిరంజీవి .. అంచులంచులుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి కెరియర్లో పెద్దగా కాంట్రవర్షలు లేవు కానీ ప్రేమ వ్యవహారాల మాత్రం ఉన్నట్టు వినికిడి .. కానీ అవి కూడా ఎప్పుడు బయటకు రాలేదు .. అందులోనూ నిజం ఎంత ఉందో కూడా తెలియదు.


అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ ప్రేమ కథ గతంలో వైరల్ గా మారింది .. ఆయన ఓ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించాడని.. కానీ ఆమె మరో హీరోను పెళ్లి చేసుకున్నారని .. వన్ సైడ్ లవ్ వరకే మెగాస్టార్ పరిమితం అయ్యారంటూ తెలుస్తుంది .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసింది రాధిక , విజయశాంతి , రాధా, సుమలత .. చిరంజీవి వీరితోనే ఎక్కువ సినిమాలు చేశారు. అయితే వీరులో సుమలతతో చిరంజీవి ఎక్కువ స్నేహంగా ఉండేవారు .. అలాగే చాలా సినిమాలు కూడా కలిసి నటించారు .. ఆ టైంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టిందని .. ప్రధానంగా చిరంజీవి ఆమెను గాఢంగా ప్రేమించారంటూ  పలు రూమర్లు గట్టిగా వినిపించాయి .. అంతేకాకుండా వీరి ప్రేమ విషయం చిరు భార్య సురేఖకు తెలిసిందంటూ అలా తిరుగుతూ వచ్చింది .. అయితే ఇది గతంలో ఎప్పుడో వచ్చిన ఒక రూమర్ అప్పట్లో ఇది బాగా వైరల్ అయింది.

 

అయితే ఈ వార్తలపై అప్పుడు సుమలత తీవ్ర స్థాయిలో మండిపడ్డారట .. అలాగే ఇలాంటివి ఎందుకు రాస్తారంటూ విరుచుకుపడ్డారని అలాంటి ప్రచారాలు చేసిన వారిపై పోలీసు కంప్లైంట్ కూడా ఇస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట  సుమలత. ఇక మెగాస్టార్ గురించి ఇంతవరకు ఇలాంటి రూమర్ రాలేదు .. ఆయన తన లైఫ్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరు సంవత్సరాల లోపే దివంగత అగ్ర నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు .. అందుకే ఆయనపై ఇండస్ట్రీలో ఇలాంటి తప్పుడు వార్తలు రాలేదు .. అలా అని మీడియా వాళ్ళు ఎక్కడ ఆగరు కదా ఎప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటారు.. అలాంటిదే చిరంజీవి మీది కూడా సుమలత తో ప్రేమ రూమర్ వచ్చి పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: