సాయి పల్లవి .. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ హీరోయిన్ పేరే మారుమ్రోగిపోతుంది.  హీరోయిన్ సాయి పల్లవి అందంగా ఉంటుంది.  చాలా చక్కగా మాట్లాడుతుంది.  చాలా చక్కగా అందరితో కలిసిపోతుంది. చక్కగా నటిస్తుంది . మరీ ముఖ్యంగా క్యారెక్టర్ ఉన్న పాత్రలనే చూస్ చేసుకుంటుంది . చడ్డీలు మిడ్డీలు వేసుకునే  క్యారెక్టర్ లాంటి హీరోయిన్  ఉన్న పాత్రలను సాయి పల్లవి అస్సలు చూస్ చేసుకోదు . ఇలాగే సాయి పల్లవి గురించి ప్రతి ఒక్క అభిమాని మాట్లాడుకుంటూ ఉంటారు.


అయితే సాయి పల్లవి కన్నా ముందు ఇలాగే ఇండస్ట్రీలో కండిషన్స్ పెట్టుకొని మరి తన కెరీర్ ని ప్లాన్ చేసుకున్న మరొక హీరోయిన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఆమె మరెవరో కాదు ప్రత్యూష . చాలా చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారి అంతకంటే అతి తక్కువ టైంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ప్రత్యూష గురించి అందరికీ తెలిసిందే . ఆ విమరణం ఇప్పటికీ ఒక మిస్టరీ .



అసలు ఏం జరిగింది..? ఎలా జరిగింది..? ఎందుకు జరిగింది..? అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కాగా ప్రతి విషయం కూడా సినిమాలో నటించేటప్పుడు తన కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ ఉండేదట. వల్గర్ రోల్స్ లో నటించకూడదు . రొమాంటిక్ సీన్స్ లో హద్దులు మీర కూడదు . పిచ్చిపిచ్చి డ్రెస్సులు వేయకూడదు అంటూ ఇప్పుడు సాయి పల్లవి ఎలాంటి రూల్స్ అయితే ఫాలో అవుతుందో అలాంటి రూల్స్ అప్పట్లో ప్రత్యూష కూడా పెట్టుకుందట . దీనికి సంబంధించిన విషయాన్నీ మరొకసారి గుర్తు చేసుకొని ప్రత్యూష పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు . సోషల్ మీడియాలో సాయి పల్లవికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా సరే ప్రత్యూషకి అంతే ప్రేమ అభిమానాలు అందించారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: