బాలీవుడ్ అందాల భామ టాలెంటెడ్ యాక్ట్రెస్ అలియా భట్ తెలుగు ఆడియన్స్ కు కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో దగ్గరైంది. అమ్మడు ఏ సినిమా చేసినా సరే అందులో తన మార్క్ నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. అలియా భట్ ఈమధ్యనే చేసిన సినిమా జిగ్రా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాగా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

ఇదిలాఉంటే ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత మరోసారి అలియా భట్ తెలుగు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి చూపిస్తుంది. సరైన కథ కుదరట్లేదని ఇన్నాళ్లు వెయిట్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే లేటెస్ట్ గా అలియా భట్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన కథకు ఓకే చేసినట్టు టాక్. కల్కి లాంటి సినిమాతో నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.

కల్కి 2 చేయాల్సి ఉన్నా ప్రభాస్ ఫ్రీ అవ్వడానికి కాస్త టైం ఉంటుందని అలియాతో మరో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట నాగ్ అశ్విన్. తప్పకుండా నాగ్ అశ్విన్ అలియాతో ఒక మంచి సినిమా చేస్తాడని అంటున్నారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలతో మెప్పించిన నాగ్ అశ్విన్ కల్కి తో సర్ ప్రైజ్ చేశాడు. కల్కి 2 చేసేలోగా అలియాతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట. ఆల్రెడీ కథా చర్చలు ముగిసినట్టు తెలుస్తుంది. మరి అలియా భట్ తో నాగ్ అశ్విన్ ఎలాంటి సినిమా చేస్తాడు. ఈసారి నాగ్ అశ్విన్ ఎలాంటి కథతో వస్తారన్నది చూడాలి. నాగ్ అశ్విన్ సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉండేలా చేసుకున్నాడు. తప్పకుండా అతని నుంచి వచ్చే సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంది. అలియా మరోసారి సౌత్ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు అలియా ఎంతో సంతోషంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: