ఫ్యామిలీ స్టార్ డిజప్పాయింట్ చేయడంతో త్న నెక్స్ట్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ఫిక్స్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం అతను చేస్తున్న కింగ్ డమ్ సినిమా ఒక సునామిలా రాబోతుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్ డం సినిమా టీజర్ తోనే అదుర్స్ అనిపించారు. సినిమా తప్పకుండా ష్యూర్ షాట్ హిట్ పడేలా ఉంది.

కింగ్ డమ్ టీజర్ వచ్చిందే ఆలస్యం దాన్ని చూసి బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా యూఎస్ లో కింగ్ డమ్ బిజినెస్ షాక్ ఇస్తుంది. రిలీజ్ కు టైం ఉన్నా కూడా సినిమా ఇప్పటికే బిజినెస్ విషయంలో అదరగొట్టేస్తుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాకు యూఎస్ లో 2 మిలియన్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు అక్కడ సినిమాను భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

విజయ్ దేవరకొండ అసలు సిసలు స్టామినా ఏంటన్నది ఈ సినిమా తో ప్రూవ్ అయ్యేలా ఉంది. టీజర్ తోనే అదరగొట్టిన దేవరకొండ హీరో సినిమాతో పక్కా భారీ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి కింగ్ డమ్ తో విజయ్ మార్క్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా మే 30న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తో మరోసారి తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టేస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: