హనీ రోజ్ ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొద్దిరోజుల క్రితం ఎక్కడ చూసినా హనీ రోజ్ పేరే వినిపించింది. సోషల్ మీడియాలోనూ హనీ రోజ్ వార్తలు రోజుకోకటి వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ ఇదివరకే ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు మరదలు పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాతో ఈ చిన్నదానికి ఎనలేని గుర్తింపు దక్కింది.


సినిమా అనంతరం హనీ రోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు నటిస్తూ బిజీగా మారిపోయింది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా అవకాశాలను అందుకుంది. హనీ రోజ్ గుర్తింపును చూసి చాలామంది షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కార్యక్రమాలకు కూడా పిలిచారు. అందులోను హనీ రోజ్ చాలా యాక్టివ్ గా పాల్గొని భారీగా డబ్బులను సంపాదించింది. అంతేకాకుండా పలు బ్రాండ్లకు ప్రమోషన్లను కూడా నిర్వహించింది. ఇక హనీ రోజ్ రోజురోజుకు తన గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.


ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది కుర్రాళ్ళకు ఈ చిన్నది డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం హనీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిన్నదానికి మళ్ళీ అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హనీ రోజ్ పీకల దాకా మద్యం సేవిస్తుందట.


రాత్రి అయితే చాలు పీకల దాకా తాగి పడుకుంటుందట. ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉన్న హనీ రోజ్ మద్యానికి అలవాటు పడడంతో తన కుటుంబ సభ్యులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయం హనీ రోజ్ సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: