![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/alia-bhatt02b38784-d841-44d0-8b0b-11c1b9921f57-415x250.jpg)
అనంతరం గంగుబాయి, ఆర్ఆర్ఆర్, కతియా వాడి, ఇన్షల్లా, తఖ్త్, బ్రహ్మాస్త్రం, సడక్-2 వంటి అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసిగా సీత పాత్రలో కనిపించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన నటన, అందంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ప్రస్తుతం ఆలియా భట్ హిందీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. అంతేకాకుండా తన నటనకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా....ఆలియా భట్ కదా తదుపరి సినిమాను కల్కి 2898 ఏడి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారట. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమాను చేయడానికి ఆలియా భట్ ఒప్పుకుందట. సినిమా కథను విన్న తర్వాత ఆలియా భట్ చాలా సంతోషంగా ఉన్నారట.
మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి -2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆలియా భట్ కూడా సినిమాలలో బిజీగా ఉంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైనకి వస్తుందో చూడాలి. ఆలియా భట్ తెలుగులో సినిమా చేస్తుందని తెలిసి తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.