టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన మాస్ దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన తన కెరియర్లో ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాను మాస్ ఎంటర్టైనర్ మూవీ గానే రూపొందించి అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మాస్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను "అఖండ" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను "స్కంద" అనే మూవీ ని తెరకెక్కించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఓ క్రేజీ తమిళ స్టార్ హీరోతో బోయపాటి శ్రీను సినిమాను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... గత కొంత కాలంగా బోయపాటి శ్రీను తమిళ నటుడు సూర్య హీరో గా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ క్రేజీ కాంబోలో మూవీ ఆల్మోస్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో లో సినిమా కనుక సెట్ అయినట్లయితే సూర్య తెలుగు లో నటించబోయే మొట్ట మొదటి సినిమా ఇదే అవుతుంది. ఇకపోతే ఈ క్రేజీ కాంబో లో మూవీ కనుక సెట్ అయినట్లయితే దానిపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: