‘గీత గోవిందం’ తరువాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ లేకపోవడంతో అతడి అభిమానులతో పాటు అతడితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు కూడ తెగ టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య విజయ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’ కు వచ్చిన అనూహ్య స్పందన అతడి అభిమానులకు మంచి జోష్ ను ఇచ్చింది.


వాస్తవానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించక పోవడంతో ఈ టీజర్ మరింత షాకింగ్ గా మారింది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ మే నెలలో విడుదల అవుతుందని లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను రెండు భాగాలుగ తీస్తున్నట్లు తెలుస్తోంది.


నిన్న విడుదలైన ఈ టీజర్ ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ 1కు సంబంధించింది అని తెలుస్తోంది. ఈ మూవీ కథ ఇండియా శ్రీలంక సరిహద్దుల్లో జరిగిన ఒక యదార్థ సంఘటన అని అంటున్నారు. విజయ్ దేవరకొండ పోషించిన పాత్ర బాల్యంలో జరిగిన అణిచివేత సంఘటనలు నేపధ్యంలో అతడు ఎలా రెబల్ గా మారాడు అన్న విషయం చుట్టూ నడుస్తూ  శ్రీలంక లోని తమిళుల పై ఆరోజులలో సింహళీ సైనికుల ఆగడాలు నేటితరం వారికి తెలిసే విధంగా ఈమూవీ కథ ఉంటుంది అని అంటున్నారు.


శ్రీలంక తమిళుల కష్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ తనవారి కోసం నిరంతరం తపన పడే పాత్ర విజయ్ దేవరకొండ ది అని అంటున్నారు. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక నలభై సంవత్సరాల దాకా శ్రీలంక బోర్డర్ లో ఏం జరిగింది, ఒక నాయకుడు ఎలా ఉద్భవించాడనే పాయింట్ మీద గౌతమ్ తిన్ననూరి వ్రాసిన కథకు రూపం ఈ ‘కింగ్ డమ్’ అన్న వార్తలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: