టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఈశ్వర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ప్రభాస్ ఆ సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ప్రభాస్ చాలా విజయాలను అందుకొని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ ఎంతో మంది హీరోలతో కలిసి నటించాడు. ఇకపోతే ఒక ముద్దు గుమ్మతో ప్రభాస్ రెండు సినిమాల్లో నటించగా ఆ రెండు మూవీలు కూడా అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. మరి ప్రభాస్ కి అంతలా కలిసొచ్చిన ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు కాజల్ అగర్వాల్.

ప్రభాస్ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మొదటగా డార్లింగ్ అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ , కాజల్ జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ఆ తర్వాత వీరి కాంబినేషన్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కూడా కాజల్ , ప్రభాస్ జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ప్రభాస్ , కాజల్ కాంబినేషన్లో మొత్తం రెండు సినిమాలు రాగా ఈ రెండు మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలలో కూడా వీరి జంటకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఇలా ప్రభాస్ హీరోగా రూపొందిన రెండు సినిమాలలో కాజల్ హీరోయిన్గా నటించడం , ఆ రెండు మూవీ లు కూడా మంచి విజయాలు సాధించడంతో ప్రభాస్ కి కాజల్ అద్భుతంగా కలిసి వచ్చింది అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: