![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore//images/categories/movies.jpg)
టాప్ హీరోలను పక్కకు పెడితే మీడియం రేంజ్ హీరోలలో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ మూవీలు రెండు ఘన విజయాలు సాధించడంతో నిఖిల్ తో పాటు చాలామంది మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తూ పాన్ ఇండియా హీరోలుగా మారాలని గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు నాగచైతన్య కూడ తన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాలని చేసిన ప్రయత్నాలు సక్సస్ కాలేదు అన్న మాటలు వీపిస్తున్నాయి.
‘తండేల్’ మూవీకి వచ్చిన్న పాజిటివ్ టాక్ తో తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ కలక్షన్స్ బాగా ఉండటంతో చైతూ చాల ఆనంద పడుతున్నాడు. అయితే ఈమూవీని పాన్ ఇండియా రేంజ్ లో తమిళ కన్నడ హిందీ భాషలలొ కూడ విడుదల చేశారు. అయితే ఈసినిమాను హిందీ ప్రేక్షకులతో పాటు కన్నడ తమిళ ప్రేక్షకులు కూడ ఈసినిమాను పట్టించుకోకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
వాస్తవానికి ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో తమిళనాడులో ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా ధియేటర్లకు ప్రేక్షకులు వస్తారని ఆశించినప్పటికీ ఆ ఆశ చైతూ అభిమానులకు నెరవేరలేదు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో చైతన్య నటించే సినిమాలకు ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప మరే రాష్ట్రంలోనూ పట్టించుకోరా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈమూవీ పెద్దగా నచ్చక పోవడంతో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసుకునె విషయంలో చైతన్య అంచనాలను అందుకోలేకపోయాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..