![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/sai-pallavie70feea8-d43f-4d9d-ba4c-3666d82600d8-415x250.jpg)
రీసెంట్ గానే ఈవెంట్లో అల్లు అరవింద్ తో సాయి పల్లవి డాన్స్ చేసిన వీడియో ఎంతలా ట్రెండ్ అయిందనేది అందరికీ తెలుసు. సినిమా సగం హిట్ సక్సెస్ ని మొత్తం టీం సాయి పల్లవి కి ఇచ్చేశారు . ఎప్పుడు కూడా హీరో కటౌట్స్ ని మనం చూస్తూ వచ్చేవాళ్ళం . కానీ ఫర్ ద ఫస్ట్ టైం హీరోయిన్ కట్ అవుట్ ని కూడా ఫాన్స్ థియేటర్స్ ముందు పెట్టారు అంటే దానికి కారణం సాయి పల్లవి మంచితనం అనే చెప్పాలి . కాగా సాయి పల్లవి ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్న కారణంగా అల్లు అరవింద్ ఆమెకు స్పెషల్ గా ఎక్స్ట్రా మనీ ఇవ్వాలి అంటూ అనుకున్నారట.
అయితే సాయి పల్లవి అలా ఎక్స్ట్రా మనీలు అంత యాక్సెప్ట్ చేయదు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సలహా మేరకు సాయి పల్లవికి ఎంతో ఇష్టమైన "బాబా" విగ్రహాన్ని స్పెషల్ గా గిఫ్ట్ చేసి పంపించండి అంటూ సజెస్ట్ చేశారట అల్లు అర్జున్ . అయితే అల్లు అరవింద్ ఈ పనిని పూర్తిగా అల్లు అర్జున్ కే ఇచ్చేసారట . అల్లు అర్జున్ - సాయి పల్లవి కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన సాయిబాబా విగ్రహాన్ని "తండేల్" మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఆమెకు గిఫ్ట్ చేసి పంపించారట .
ప్రజెంట్ ఈ న్యూస్ బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే సాయి పల్లవి తో అల్లు అరవింద్ ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా కుదిరిపోయింది అని త్వరలోనే సాయి పల్లవి - అల్లు అర్జున్ కాంబోలో సినిమా ఫిక్స్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఈ కాంబో కోసం వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ - సాయి పల్లవి స్క్రీన్ షేర్ చేసుకుని ఒక్క డాన్స్ సాంగ్ చేస్తే మాత్రం అది బీభత్సమైన హిట్ అయిపోతుంది అంటున్నారు . పరిస్థితులు చూస్తూ ఉంటే మెల్లమెల్లగా అది జరిగేలానే ఉంది . సాయి పల్లవి కి ఇష్టమైన గిఫ్ట్ పంపించి సోషల్ మీడియాలో ఇప్పుడు అల్లు అర్జున్ పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా దక్కించుకుంటున్నారు.