తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలకు ఉండే క్రేజే వేరు. తెలుగులోనూ సూర్య మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. తెలుగులో సూర్య సినిమాలు మంచి విజయాలను అనుకుంటున్నాయి. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. గజినీ సినిమా నుంచి సూర్యకు క్రేజ్ పెరిగిపోయింది. ఇక సూర్య హీరోగానే కాదు నిర్మతగాను రాణిస్తున్నాడు.స్టార్ హీరో అయినప్పటికీ వైవిధ్యమైన సినిమాల చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ త‌న‌దైన ఇమేజ్‌ను స్టార్ డ‌మ్‌ను పెంచుకుంటున్న హీరో సూర్య‌. ఈ త‌మిళ హీరోకి త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మార్కెట్ ఉంది. అందుక‌నే ఆయ‌న సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. తెలుగు ఆడియెన్స్ అంటే ఉండే ప్రేమ‌తో త‌న పాత్ర‌ల‌కు తెలుగులోనూ ఆయ‌న డ‌బ్బింగ్ చెప్పుకున్న సంద‌ర్భాలున్నాయి మ‌రి.సాధార‌ణంగా హీరో సూర్య త‌న సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌కి హైద‌రాబాద్ వచ్చినప్పుడు ఆయ‌నకు ఎదుర‌య్యే అనేక ప్ర‌శ్న‌ల్లో కామ‌న్ క్వ‌శ్చ‌న్ స్ట్రైట్ తెలుగు సినిమా ఎప్పుడు చేయ‌బోతున్నారు? అని. అందుకు ఆయ‌న క‌చ్చితంగా చేస్తాన‌ని చెబుతూ వ‌స్తుంటారు. అయితే ఈసారి మాట‌ల‌తో కాకుండా చేత‌ల‌తో స‌మాధానం చెప్పాల‌ని అనుకున్నారేమో ఏకంగా స్ట్ర‌యిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌.సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.అయితే దర్శకుడు ఎవరు అనేది క్లారిటి రాలేదు.అప్పుడెప్పుడో సూర్య హీరోగా బోయపాటి శ్రీను  ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు తెలుగు సినిమాను చేయ‌బోతున్నార‌నే వార్త‌లు వినిపించాయి. కానీ ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ మెటీరియ‌లైజ్ కాలేదు.అయితే తాజా సమాచారం ప్రకారం సూర్యతో సినిమా చేయబోయే దర్శకుల లిస్ట్ లో బోయపాటి శ్రీను, యంగ్ దర్శకుడు వెంకీ అట్లూరి, తండేల్ దర్శకుడు చందు మొండేటి పేర్లు వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఏ దర్శకుడికి సూర్య ఓకే అంటాడో వేచిచుడాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: