ఈ రీసెంట్ టైమ్స్ లో ఓ సినిమా సాధించిన ఘోరమైన రేటింగులు లైలా విషయంలో చూశారు ప్రేక్షకులు .. ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియాలో ఉన్న అన్ని సైట్లన్నీ ఒకటి అర రేటింగ్ లో ఇచ్చాయి ఈ సినిమాకు .. అది కూడా ఎక్కువే అన్నది ఈ సినిమా చూసిన వారి నుంచి వస్తున్న మాట .. అది వేరే విషయం .. ఒక సినిమాను ఎలా తీయకూడదు అన్నీ చెప్పడానికి లైలాని ఉదాహరణగా చూపిస్తున్నారు నెటిజెన్లు .. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చాలా దారుణంగా వస్తున్నాయి. ఆఖరికి విశ్వక్ సేన్ అభిమానులు కూడా ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటూ తెగ బాధపడి పోతున్నారు ..


లేడీ గెటప్ సినిమాలంటే గతంలో చిత్రం భళారే విచిత్రం, మేడమ్ , భామ‌నే స‌త్య‌భామ‌నే సినిమాలు గుర్తొచ్చేవి .. కాసేపు ఆ సినిమాలన్నీ తలుచుకొని నవ్వుకునే వాళ్ళు ప్రేక్షకులు .. ఇప్పటికీ ఈ సినిమాలన్నీ రిపీటెడ్ గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు .. అలాగే టీవీల్లో వస్తే సినిమా అయ్యేవరకు చూడకుండా వదలరు .. అలా లేడీ గెటప్పుల్ల జొన్నర్ కి ఓ సెప‌రేట్ అభిమానులు ఉన్నారు .. అయితే ఇప్పుడు వాళ్లంతా లైలా అని చూసి భయపడే స్థాయికి వచ్చేసారు .. ఇదంతా దర్శకుడు రచయిత చేసిన పొరపాట్లు వల్లే వచ్చింది. హీరోలు సరిగ్గా గెటప్ లు వేస్తే సినిమాలు హిట్ అయిపోతాయన్న భ్రమల్లో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి రావాల్సిందే ..


నాలుగు డబ్బా జోకులు డబల్ మీనింగ్ డైలాగులు ,  హీరోయిన్ గ్లామర్ షో ఎక్స్పోజింగ్ వల్ల సినిమాలు హిట్ అవ్వు .. రిలీజ్ కు ముందు ఎంత పబ్లిసిటీ చేసినా.. మేము అంతా పొడిచేశాం, ఇంత చించేసం , అంత కష్టపడ్డామని  పోజులు కొట్టిన అంతిమంగా ప్రేక్షకుడు ఇచ్చే రిజల్ట్ ఎంతో ముఖ్యం .. సినిమా తీసే విధానం మారుతుంది , చూసే విధానం అన్నిటిలోని భారీ మార్పులు వచ్చాయి .. చీప్ ట్రిక్స్ కీ  ప్రేక్షకులు పడిపోవటం లేదు .. ఓ సినిమా హిట్ అయింది అంటే అందులో ఎంతోకొంత నిజాయితీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించి ఉంటారు . అవి లేకపోతే .. బాక్సాఫీస్ దగ్గర ఎన్ని వేషాలు వేసిన చివరకు మిగిలేది గుడ్డి సున్నానే .. ఈ విషయాన్ని కొత్త దర్శకులు , యువ హీరోలు గుర్తుపెట్టుకుంటే ఎంతో మంచిది .. లేకపోతే లైలాకు పట్టిన గతే వారికి కూడా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: