మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు.ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ఆ సినిమా రేంజ్ లో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయిన మంచి కథతో రామ్ చరణ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ పాత్రల్లో జీవించారు. పొలిటికల్ డ్రామాలో చరణ్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. కానీ ఎందుకు ఈ సినిమా పెద్దగా సెన్సేషన్ కాలేకపోయింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్లను మాత్రం సాధించింది. ఇదిలా ఉంటే. ప్రస్తుతం చరణ్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనే అందరి చూపు ఉంది. ఎలాగైనా రామ్ చరణ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసేలా అప్ కమింగ్ ఫిల్మ్స్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే 'ఉప్పన'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబుతో ఆర్సీ16 చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. స్పోర్ట్ డ్రామాతో బిగ్ స్కేల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. గేమ్ ఛేంజర్ పనుల తర్వాత రామ్ చరణ్ రీసెంట్ గానే ఆర్సీ16 సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈచిత్రం నుంచి వచ్చే అప్డేట్స్ పై అభిమానులు , ఆడియెన్స్ లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుండగా గేమ్ ఛేంజర్ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా మొత్తమ్మీద ఆడియన్స్ కు కొద్దో గొప్పో నచ్చేదంటే ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలే. ఇప్పుడు చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ విషయంలో ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ను డైరెక్టర్ బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేశాడని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడని, అందులోని ఓ పాత్రలో నార్మల్ గానే కనిపించనున్న చరణ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం ఏకంగా 10 కేజీల బరువు తగ్గనున్నాడట. ఇదంతా వింటుంటే చరణ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయంలానే అనిపిస్తుంది.చూడాలి మరి rc16రాంచరణ్ కెరీర్ నీ ఎటువైపు తీసుకువెళ్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: