సినిమా రిలీజ్ లోకి ముందు కాంట్రవర్సీలు తెరలేపుతూ కాట్రవర్సీ స్టార్ అయినటువంటి విశ్వక్ సేన్ తాజా మూవీ లైలా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.మొదటి రోజు కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయలేదు అని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. లైలా మూవీ డిజాస్టర్ టాక్ కి కారణం ఆ హీరోనేనని,విశ్వక్ సేన్ కి పెద్ద బొక్కే పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఇంతకీ లైలా మూవీ డిజాస్టర్ టాక్ రావడానికి కారణమైన  ఆ హీరో ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి.. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడకుండా ఆయన  మాట్లాడిన కొన్ని మాటలు ప్రేక్షకులకు రుచించలేదు.అంతేకాదు అంత పెద్ద వయసులో ఉన్న ఆయన విశ్వక్ సేన్ ని చూసి కస్సక్ ఫిగర్ అని మాట్లాడడం కూడా కొంత మందికి రుచించలేదు.

 అలాగే స్టేజ్ పైన సినిమా గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడుతూ జై జనసేన అని ప్రజారాజ్యాన్ని జనసేన ఒక్కటేనని పవన్ కళ్యాణ్ గురించి ఇలా పొంతనలేని మాటలు మాట్లాడడంతో సినిమాని మర్చిపోయి రాజకీయాలే గుర్తు చేసుకున్నారు. అలా విశ్వక్ సేన్ తన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని గెస్ట్ గా తీసుకువచ్చి తన సినిమాకి ప్లస్ చేసుకుందాం అనుకుంటే  చిరంజీవి గురించి మాట్లాడి మైనస్ గా మారిపోయింది. విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడం వల్లే విశ్వక్సేన్ సినిమాని ఎవరు పట్టించుకోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

 అలాగే కూటమి సపోర్టుగా చిరంజీవి మాట్లాడడంతో వైసిపి అభిమానులు సినిమాని చూడలేదని అలా లైలా మూవీ డిజాస్టర్ కి పరోక్ష కారణం మెగాస్టార్ చిరంజీవి కూడా అయ్యారంటూ కొంతమంది పోస్టులు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి  ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు సినిమా డిజాస్టర్ అయింది అని మరికొంతమంది చిరంజీవి అంటే గిట్టని వాళ్లు పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు విశ్వక్ సేన్ లైలా సినిమా డిజాస్టర్ అవ్వడానికి సవా లక్ష కారణాలు తెరమీదకి తీసుకువస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: