రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు.. కల్కి సినిమా తర్వాత చాలా దేశాలలో కూడా ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఫౌజీ, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి చిత్రాలలో నటించబోతున్నారు. అయితే స్పిరిట్ సినిమాకి చిత్ర బృందం ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది.. ఎవరైనా ఈ సినిమాలో నటించాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తూ ఉండడంతో భారీ క్రేజ్ ఏర్పడింది.


ఇటీవలే యానిమల్  సినిమాతో తన స్టామినా చూపించిన సందీప్ రెడ్డి వంగ రూ .900 కోట్లకు పైగా కలెక్షన్స్ తో పలు రికార్డును సృష్టించింది. ప్రస్తుతం స్పిరిట్ సినిమా పనులలో బిజీగా ఉన్న సమయంలోనే .. అన్ని వయసుల పురుషులు ,మహిళలు నాటక రంగ ఉన్న నేపథ్యంలో ఉండేవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అవకాశం కోసం అంటూ ప్రకటన రావడంతో టాలీవుడ్ నుంచి మంచు విష్ణు రియాక్ట్ అవుతూ.. యో.. తాను కూడా ఈ సినిమాకి అప్లై చేశాను ఏం జరుగుతుందో చూడాలి అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.


ఈ పోస్ట్ విన్న చాలా మంది ఆశ్చర్య పోయినప్పటికీ మంచు విష్ణులో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తన నిర్మాణ సంస్థలోనే కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాట కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇందులో ప్రభాస్ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే చాలామంది నటీనటులు కూడా ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. మరి నిజంగానే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో మంచు విష్ణు నటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: