ఒకప్పుడు మలయాళం సినిమాలు అంటే తక్కువ బడ్జెట్ తో సినిమా తీసి భారీ వసూళ్లు సంపాదించేవి. కానీ ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాలు తీసిన ఒకటి కూడా మంచి హిట్ కొట్టడం లేదు. కేరళలో సినిమా షూటింగ్ లు, రిలీజ్ లు బంద్ అయ్యాయి. ఈ ఏడాది జూన్ ఒకటోవ తేదీ నుండి సినీ పరిశ్రమలో షూటింగ్ ఆపేయడం జరిగింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

ప్రొడ్యూసర్, డిస్ట్రీబ్యూటర్ లా డిమాండ్లను నెరవేర్చేందుకు, థియేటర్ లలో కూడా సినిమాల రిలీజ్ సైతం నిలిపివేశమని ఫిలిం ఎంప్లాయూస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ వెల్లడించింది. అయితే మలయాళం సినీ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ లకు అలాగే ఇతర సినిమా పనులకు గాను బడ్జెట్ పెరిగింది. కానీ సక్సెస్ రేట్ మాత్రం తగ్గిపోతూ వస్తుందని తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం ఎంప్లాయూస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ స్పష్టం చేసింది.
 
అయితే సినీ పరిశ్రమలో సక్సెస్ అంతగా లేకపోయినప్పటికీ.. నటీనటులకు మాత్రం పారితోషికం పెరుగుతూనే వస్తుంది. అలాగే వారితో పాటు టెక్నీషియన్ లకు కూడా చాలా ఖర్చు అవుతుంది అంట. ఇక ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉండడంతో ఈ భారం అంతా నిర్మాతల పైన పడుతుంది. దీంతో నిర్మాతలు ఎంతలా నష్టపోతున్నారో.. కేరళ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షుడు, నటుడు సురేష్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను పరిస్కరించేందుకు మాలీవుడ్ సమ్మె బాట పట్టింది. ఇక దీని ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద పడి మలయాళం సినీ ఇండస్ట్రీపై దెబ్బ పడే అవకాశముంది. అలాగే మలయాళం సినిమాల పరిస్తితి కూడా గందరగోళంగా మారనుంది. ఇక ఈ సమస్యను పరిష్కరించేందుకు కేరళ ముఖ్యమంత్రి కలిసి, తుది నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటివరకు సినిమాకు చెక్ పెట్టినట్లే.   
   

మరింత సమాచారం తెలుసుకోండి: