తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలే ఎక్కువ అయిపోయాయి. ఒక భాషలో ఏదైనా సినిమా హిట్ కొట్టిందంటే చాలు.. ఆ సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేయడమే. అయితే అలా సక్సెస్ అయిన సినిమాను తీసి హిట్ కొట్టడం పెద్ద విషయం కాదని కొందరు అంటారు. ఒక భాషలోని హిట్ సినిమాను మన భాషలో తీసి హిట్ అందుకోవడం పెద్ద ఛాలెంజ్ అని మరికొందరు అంటారు. ఏది ఏమైనప్పటికి ఒక హిట్ అయిన సినిమాను తీసి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ ని బీట్ చేయడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది.

ఇక ఈ రీమేక్ సినిమాలు తీసే అప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కొంచెం అటు, ఇటు అయిందో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా కూడా ఫ్లాప్ అయి కూర్చుంటుంది. ఇదిలా ఉండగా.. ఓటీటీలు వచ్చినప్పటి నుండి ఈ రీమేక్ సినిమాలను ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే పెద్దగా వర్కౌట్ అవ్వక, ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవాల్సి వస్తుంది.      
తెలుగులో టాలీవుడ్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి గురించి పరిచయం అనవసరం. చిరంజీవి దాదాపు 50 వరకు రీమేక్ సినిమాలు తీశారు. అందులో కొన్ని సినిమాలు హిట్, మరోకోన్ని ఫట్టు అయ్యాయి. అయితే ఓటీటీ వచ్చిన తర్వాత తీసిన గాడ్ ఫాదర్, భోలా శంకర్, ఖైదీ నెంబర్ 150 సినిమాలు ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.

అలాగే మాస్ మహారాజు రవితేజ తీసిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అడిజాస్టర్ అయ్యింది. ఇక ఓరి దేవుడా, జాను, బుట్టబొమ్మ సినిమాలు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోలేకపోయాయి. దీంతో రీమేక్స్ నిర్మాతల కొంప ముంచుతున్నాయి. వాటి వల్ల నిర్మాతలకు కోట్లల్లో నష్టాలు వస్తున్నాయి. ఇక ఈ కారణంగా రీమేకులకు బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: