![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/siri-hanumanth-eedf1a36-c496-4f91-9f66-bd2632240f3e-415x250.jpg)
సిరి హనుమంత్ జీ5లో సూపర్ హిట్ పులి మేక సిరీస్, ఆహాలో bff సిరీస్ లో కూడా నటిస్తూ అలరిస్తోంది. అయితే ఈ అందాల భామ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. సిరి నరసింహపురం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సిరి తీరును తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై తాజాగా సిరి స్పందించింది. 'నాకు ఎవరితో ఎలాంటి సమస్య లేదు. ముఖ్యంగా హీరో నంద గోపాల్ గారితో అసలు లేదు. నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమా ప్రమోషన్స్ కి వెళ్లలేకపోయాను. కానీ దానికి ఆయన హర్ట్ అయ్యారు. కానీ మేము ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం షూటింగ్ లో.. నన్ను బాగా చూసుకున్నారు' అని సిరి హనుమంత్ చెప్పుకొచ్చింది
ఈమె విశాఖపట్టణంలో జన్మించింది. సిరి హనుమంత్ స్టార్ మాలో ప్రసారమైన ఉయ్యాల జంపాలా సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో తొలిసారిగా నటించింది. ఎవరే నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి పలు సీరియల్స్‌లలో ఆమె నటించింది. ఇద్దరి లోకం ఒకటే , ఒరేయ్ బుజ్జిగా, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో కూడా ఆమె నటించింది.