
ఇదిలాఉంటే గేమ్ ఛేంజర్ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఒక చిన్న రోల్ లో నటించారు. ఆయన సినిమాలో విజయనగరం కలెక్టర్ గా నటించారు. ఐతే కనిపించడానికి అది చాలా చిన్న పాత్ర. ఈ విషయాన్ని బ్రహ్మానందం లేటెస్ట్ మూవీ రిలీజ్ టైం లో అడిగితే మీరు చూసింది చిన్న పాత్ర కానీ నేను చేసింది పెద్ద పాత్ర అని అన్నారు బ్రహ్మానందం.
గేమ్ ఛేంజర్ లో బ్రహ్మి ఒకటి రెండు సీన్స్ లోనే కనిపించాడని అనుకుంటే ఆయనేమో చాలా ఎక్కువ చేశామని కానీ అది సినిమాలో లేదని చెప్పారు. ఐతే తను నటించిన సినిమాలను కూడా తాను చూడనని క్లారిటీ ఇచ్చారు బ్రహ్మానందం. టీవీ లో వస్తే చూడటం తప్ప థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా ఏళ్లు అవుతుందని తెలుస్తుంది. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతం తో కలిసి చేసిన బ్రహ్మ ఆనందం సినిమా శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గేం ఛేంజర్ సినిమాలోనే బ్రహ్మిది ఒక సీన్ ఉన్న పాత్ర అనుకున్న ఆడియన్స్ కు ఆయన ఇచ్చిన ఆన్సర్ మాత్రం షాక్ ఇచ్చింది. సినిమా రన్ టైం వల్ల బ్రహ్మానందం సీన్స్ లేపేశారేమో కానీ ఆయన మాత్రం చాలా సీన్స్ చేసినట్టుగా బ్రహ్మానందం మాటల్లో అర్ధమైంది.