
కారీకా ఆర్యన్ బారు జుట్టు గుబురు గడ్డంతో సింగర్ గా కనిపించాడు. ఇక శ్రీలీల అతని ప్రేయసిగా నటిస్తుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ ఒక రేంజ్ లో ఉండేలా ఉంది. ఐతే గ్లింప్స్ చూసిన వారందరికీ ఇది ఆషికి ఫ్రాంచైజ్ సినిమానా అనిపించక మానదు. ఐతే సినిమా టైటిల్ చెప్పకుండా ఈ ఇయర్ దీవాళి రిలీజ్ అని ప్రకటించారు.
ఈ సినిమాలో శ్రీలీల గ్లామర్ డాల్ గా కనిపించనుంది. అంతేకాదు కార్తీక్ ఆర్యన్ తో ఘాటు లిప్ లాక్ కూడా చేసినట్టు టాక్. బాలీవుడ్ కి వెళ్లగానే శ్రీలీల కూడా అందరిలానే రెచ్చిపోతుంది. ఐతే ఆషికి సీక్వల్ కథగా ఇది వస్తే మాత్రం ఆ ఫ్రాంచైజ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా శ్రీలీలకు కూడా సూపర్ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆషికి 2 లో శ్రద్ధ కపూర్ నటించగా అమ్మడు ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి టాప్ లీగ్ లోకి వచ్చేసింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ సినిమానే ఈ ఫ్రాంచైజ్ ఛాన్స్ రావడం లక్కీ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా శ్రీలీల కు ఈ ఆఫర్ ఆమె కెరీర్ కు అదే పాన్ ఇండియా పాపులారిటీకి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. తెలుగులో అమ్మడు చేసిన సినిమాలన్నీ కూడా ఫలితాలు ఎలా ఉన్నా శ్రీలీలకు ఫాలోయింగ్ మాత్రం పెరిగింది.