
అందులో సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. మొదటి నుండి ఇప్పటివరకు ఈ షోలో టాప్ జోడీగా అమర్ దీప్- తేజస్విని కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రేరణ కంబం అంటే తెలియని వారుండారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఓంకార్ అడిగినట్లు గానే.. ప్రేరణ తన భర్త శ్రీపాద్ తో కలిసి ఇస్మార్ట్ జోడీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ప్రేరణ, శ్రీపాద్ ఇస్మార్ట్ జోడీ షోలో రెండోవ స్థానంలో ఉన్నారు. ఇక ఇప్పటికీ కూడా అమర్ దీప్, తేజు టాప్ వన్ జోడీగా ఉన్నారు. ఇక ఈ సీజన్ విన్నర్ తేజు, అమర్ అని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉండగా.. తెలుగు టీవీ షోలలో, స్టార్ మా ఛానెల్ లో అటు సీరియల్స్ లో, ఇటు షోలలో ఇతర తెలుగు ఛానెల్స్ కు అందనంత ఎత్తులో ఉంటోంది. టీఆర్పీ రేటింగ్స్ లో ఆ ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలన్నీ తిరుగులేని రేటింగ్స్ తో దూసుకెళ్తున్నాయి. అయితే స్టార్ మాలో బిగ్ బాస్ ప్లేస్ లో వచ్చిన ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడే టాప్ లో నిలవడం విశేషం. టాప్ 5లో ఇస్మార్ట్ జోడీ షో టాప్ 1 లో నిలిచి ప్రేక్షకుల మనసు మరోసారి గెలుచుకుంది. ఈ షో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. అయితే తొలి ఎపిసోడే మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి అర్బన్, రూరల్ కలిపి 5.23 రేటింగ్ నమోదు కావడం విశేషం.