నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు.. అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలయ్యసినిమా తరువాత బ్యాక్ టూ బ్యాక్ మూడు సూపర్ హిట్స్ అందుకున్నాడు..ప్రస్తుతం బాలయ్య కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంది.. ప్రస్తుతం బాలయ్య తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు.. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి.. దీనితో నాలుగో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “అఖండ” సినిమాకు సీక్వెల్ గా “అఖండ 2:తాండవం” అనే బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కిస్తున్నారు.. ప్రస్తుతం బాలయ్యసినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.. 

అలాగే సూపర్ స్టార్ మహేష్ వరుస సక్సెస్ లు అందుకుంటూ జోరు మీద వున్నాడు.. గత ఏడాది గుంటూరు కారంతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు..”SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. 

ఇలా వరుస సినిమాలతో జోరు మీద వున్న ఈ ఇద్దరి హీరోలను కలిపి ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చేయాలనీ దర్శకుడు పూరీ జగన్నాద్ భావించాడు.. పూరీ మహేష్ తో పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి బిగ్ మూవీస్ చేసాడు.. అలాగే బాలయ్య తో పైసా వసూల్ సినిమా చేసాడు.. ఆ చనువుతోనే ఇద్దరిని బిగ్ మల్టీ స్టారర్ మూవీకి ఒప్పించినట్లు సమాచారం.. ఆ ఇద్దరు హీరోలు ఒప్పుకున్నా మంచి కథ సెట్ చేయడంలో పూరీ ఫెయిల్ అయ్యాడు.. కాంబినేషన్ వర్క్ఔట్ అయినా కథ వర్క్ ఔట్ కాకపోవడంతో బిగ్ మల్టీస్టారర్ మూవీ ఆగిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: