మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుంది.అందులో మొదటి భర్తతో కూతురు పుట్టాక విడాకులు తీసుకొని ఇంటికి వచ్చేసింది. అయితే మొదటి భర్త రీసెంట్ గానే మరణించాడు.ఇక రెండో పెళ్లి చేసుకున్న కూడా రెండో భర్తతో ఎన్నో రోజులు కొనసాగలేదు. వాళ్లిద్దరికి కూడా ఒక పాప పుట్టాక విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట వేరువేరుగానే ఉంటున్నారు. ఇక వీళ్లిద్దరికి పుట్టిన పాప కొద్ది రోజులు కళ్యాణ్ దేవ్ దగ్గర మరికొద్ది రోజులు శ్రీజ దగ్గర ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలైతే కుప్పలు తెప్పలుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ తో కళ్యాణ్ దేవ్ కూడా రెండో పెళ్లికి రెడీ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 

మరి ఇంతకీ కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఆ పోస్ట్ ఏంటి.. నిజంగానే ఆయన రెండో పెళ్ళికి రెడీ అవుతున్నారా అనేది ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నాక  తన లైఫ్ లో జరిగే ప్రతి చిన్న ఈవెంట్లో కూడా తన కూతురు తో కనిపిస్తున్నారు. అలా తాజాగా వాలెంటైన్స్  డే సందర్భంగా కూడా కళ్యాణ్ దేవ్ తన కూతురుతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. అంతేకాకుండా రెడ్ హాట్ సింబల్, రెడీ రోజెస్ లను పోస్ట్ చేసి నేను ఎల్లప్పుడూ ప్రేమనే ఎంచుకుంటాను. మరి మీరు అన్నట్లుగా క్యాప్షన్ పెట్టాడు.అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ కళ్యాణ్ దేవ్ మళ్ళీ ప్రేమలో పడిపోయారు.

ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోబోతున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో అని కామెంట్స్ పెడుతుంటే మరి కొంత మందేమో తన కూతుర్ని ఉద్దేశించి అలా కామెంట్ పెట్టారు. తన కూతురిపై ఎప్పటికీ ప్రేమనే పెంచుకుంటారని ఆ పోస్టు అర్థం అని అంటున్నారు. కానీ ఇంకొంతమందేమో కళ్యాణ్  దేవ్ మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి అని కోరుకుంటున్నారు. మరి నిజంగానే కళ్యాణ్ దేవ్ రిలేషన్ లో ఉన్నారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: