
అయితే అలాంటి సమయంలోనే సింగర్ మంగ్లీ కూడా వారితో ఫోటో దిగి అభినందించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు సింగర్ మంగ్లీ పైన చాలా ఫైర్ అవ్వడమే కాకుండా కేంద్రమంత్రి ఎమ్మెల్యే పైన కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం మంగ్లీ వైసీపీ పార్టీ వ్యక్తి అని దుర్భాషలు చేయడంతో తాజాగా మంగ్లీ ఒక సంచలన లేఖ విడుదల చేసినట్లు తెలుస్తోంది వాటి గురించి చూద్దాం . దేవుడు కార్యక్రమానికి కూడా ఒక రాజకీయ పార్టీ ముద్ర వేయడం చాలా అన్యాయమని 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తనని సంప్రదిస్తేనే పాటలు పాడానని తెలిపింది.
ఆ తర్వాత రెండు నియోజకవర్గాలలో క్యాంపెయిన్ కూడా చేశానని అక్కడ స్థానిక నేతలు వ్యక్తిగతంగా తనకు బాగా తెలుసు కావడం చేతనే ప్రచారంలో పాల్గొన్నారని ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు దూషించలేదని వెల్లడించింది. తాను ఎక్కడా కూడా పార్టీ గురించి కానీ,పార్టీ జెండా కూడా ధరించలేదని అప్పటి పరిస్థితులలో ఒక కళాకారునిగా పాటలు పాడానని వైయస్ఆర్సీపీ ఒకటే కాదు బిజెపి, టిఆర్ఎస్ వంటి పార్టీలకు కూడా తను పాటలు పాడాలని తెలిపింది అలాగే అందరు పార్టీ లీడర్లు కూడా తనకి స్నేహబంధం ఉందని తెలిపారు.
2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపి తో పాటు అన్ని పార్టీల ప్రచార పాటలు పాడాలని కోరడంతో వాటిని తిరస్కరించానని వెల్లడించింది.. 2019 ఎన్నికల ముందు కూడా టిడిపి పార్టీకి సంబంధించిన వారు తనని ఎవరు కూడా సంప్రదించలేదని తెలిపింది. తాను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాదు అంటూ తాజాగా తెలియజేసింది. ఎలాంటి రాజకీయాలు తనమీద చేయవద్దని ఇప్పటికే తన ఎన్నో అవకాశాలు కోల్పోయానని వెల్లడించింది.