మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. పోకిరి, బిజినెస్ మాన్ వంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టగా బిజినెస్ మాన్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. వీరి కాంబోలో మంచి సినిమాలు రావడంతో జనగణమన సినిమా కూడా మహేష్ బాబుని హీరోగా తీసుకున్నారు పూరి జగన్నాథ్.కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్దలు రావడంతో ప్రస్తుతం వీరి మధ్య మాటల్లేవు. అలాగే జనగణమన ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఇక ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో అనుకుంటున్నారు.ఈ విషయం పక్కన పెడితే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ మహేష్ బాబు నిజస్వరూపం బయట పెట్టారు. ఆయన అలాంటి వారే అంటూ మహేష్ పరువు మొత్తం తీసేసారు. మరి ఇంతకీ పూరి జగన్నాథ్ ఏమన్నారయ్యా అంటే.. మహేష్ బాబు హిట్స్ ఉన్న డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తారు తప్ప హిట్స్ లేకపోతే ఆ డైరెక్టర్ని కన్నెత్తి కూడా చూడరు.. 

అసలు వారు కలవడానికి ఇంటికి వెళ్లినా కూడా పట్టించుకోరు అలాంటివారు అంటూ పూరి జగన్నాథ్ మహేష్ బాబు ఎలాంటివారో చెప్పారు. అయితే ఆ ఇంటర్వ్యూలో మహేష్ గురించి చెప్పిన పూరి జగన్నాథ్ కి మరి మీ సినిమా ఇప్పుడు హిట్టయితే మళ్లీ మహేష్ బాబు తో చేస్తారా అని యాంకర్ అడగగా ఇప్పుడు నేను మహేష్ బాబు తో అయితే అస్సలు చేయను అంటూ ఓపెన్ గానే చెప్పేసారు. అయితే పూరి జగన్నాథ్ ఈ మాటలు మాట్లాడడానికి కారణం మహేష్ బాబు చేసిన అవమానమే అంటారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ప్లాఫుల్లో ఉన్న సమయంలో మహేష్ తో సినిమా చేద్దామని ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో కనీసం పూరి జగన్నాథ్ ని మహేష్ బాబు మందలించలేదని, కథ వినడానికి కూడా ఒప్పుకోలేదని అందుకనే పూరి జగన్నాథ్ మహేష్ బాబుని అంతలా అసహ్యించుకుంటున్నారని తెలుస్తుంది.

ఇక మహేష్ బాబు హిట్స్ ఉన్న డైరెక్టర్లకే ఛాన్స్ ఇస్తారు కానీ హిట్స్ లేని డైరెక్టర్లకు బాలకృష్ణ ఛాన్స్ ఇస్తారు. అలాంటి క్వాలిటీ ఒక బాలకృష్ణ లోనే ఉంది.నాకు హిట్స్ లేకపోయినా బాలకృష్ణ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు అంటూ పూరి జగన్నాథ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక అప్పటి పూరి జగన్నాథ్ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ మహేష్ బాబు పై పూరి జగన్నాథ్ కి ఉన్న పగ మొత్తం బయటికి కక్కేసాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: