టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి మాస్ ఈమేజ్ ను సంపాదించుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి వాటిలో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ కు వరుస పెట్టి అపజయాలే వస్తున్నాయి. ఆఖరుగా గోపీచంద్ , శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల ఆయన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే గోపీచంద్ తన నెక్స్ట్ మూవీ ని ఏకంగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తో సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో సంకల్ప్ రెడ్డి ఒకరు. ఈయన ఘాజి అనే మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన అంతరిక్షం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీచంద్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా ఒక సంకల్ప్ రెడ్డి ఓ కథను గోపీచంద్ కు వినిపించగా ఆయనకు కూడా ఆ స్టోరీ బాగా నచ్చడంతో సంకల్ప రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc