మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటీమణి తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఈ బ్యూటీ నేను శైలజ అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కడం , ఈమె నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్స్ స్థాయికి చేరిపోయింది.

ఇకపోతే ఈమె ఏక కాలంలో ఓ వైపు తమిళ్ మరో వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూ రెండు ఇండస్ట్రీ లలో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా హిందీ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. కానీ ఈ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ మరి కొంత కాలం లోనే మలయాళ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ ముద్దు గుమ్మ మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి టోవినో థామస్ హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: