కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ఆడియో హక్కులను జంగిల్ మ్యూజిక్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరస విజాయలతో ఫుల్ జోష్ లో ఉన్న శివ కార్తికేయన్ నటిస్తున్న మూవీ కావడం , కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే మురుగదాస్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న సికిందర్ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మురగదాస్ ఏక కాలంలో శివ కార్తికేయన్ మరియు సల్మాన్ ఖాన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk