తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నాగ్ అశ్విన్ ఒకరు. ఈయన నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీతో నాగ్ అశ్విన్ విమర్శకుల ప్రశంసలను పొందాడు. ఆ తర్వాత ఈయన మహానటి అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ కి సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీ తో నాగ్ అశ్విన్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇకపోతే కల్కి 2898 AD పార్ట్ 2 ముందు నాగ్ అశ్విన్సినిమా చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన ఆలియా భట్ ప్రధాన పాత్రలో ఓ మూవీ చేయడానికి డిసైడ్ అయినట్లు , అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఆలియా ను కలిసి ఆమెకు ఓ కథను కూడా నాగ్ అశ్విన్ వివరించినట్లు తెలుస్తోంది. ఆ స్టోరీ అద్భుతంగా నచ్చడంతో వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఆలియా అప్పటికే రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇక మరోసారి ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: