![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/director-puri-740041ee-8408-4755-9d94-73f76dc2fbd6-415x250.jpg)
అయితే తాజాగా పూరీ కేడీ సినిమా సెట్స్ లో కనిపించారు. ఈ సినిమాలో హీరోగా ధృవ సర్జా నటిస్తున్నాడు. ఈ కన్నడ సినిమా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా సెట్ లో పూరీ, ఛార్మీ తో కలిసి కనిపించారు. టాలీవుడ్ హీరోయిన్ రక్షిత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆమె సెట్ కు సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేసింది. ఇక ఆ పోస్ట్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ రక్షిత ఆ పోస్ట్ కి ఎమోషనల్ క్యాప్షన్ కూడ పెట్టింది. నా బ్యూటిఫుల్ జర్నీలో భాగమైన ఇద్దరు దర్శకులు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అప్పు సినిమా చేశాను. నా మొదటి సినిమా అది.. నా కెరీర్ ని అప్పు సినిమాతోనే ప్రారంభించాను. అప్పటినుండి ఇప్పటివరకు మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్. మంచిగా, సన్నిహితంగా ఉంటాము. ఇక నేను అనుక్షణం ఆరాధించే వ్యక్తి ప్రేమ్. అతని పని వేలాది మందికి స్పూర్తిని ఇస్తుంది. అతని వల్లే నేను ఇప్పడూ ఇలా ఉన్నాను. నన్ను మర్యాదగా నిలబెట్టిన వ్యక్తి ప్రేమ్. ప్రేమ్ ఎప్పటికీ నాతోనే ఉంటాడు. పూరీ మా సెట్ కి వచ్చి, అందరితో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది' అని రక్షిత రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.